రేపటి నుంచి రెండో టెస్టు... కోహ్లీ, బుమ్రాలను ఊరిస్తున్న ఘనతలు

  • టీమిండియా, ఆస్ట్రేలియా మధ్య బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ
  • డిసెంబరు 6 నుంచి 10 వరకు పింక్ బాల్ టెస్టు
  • అడిలైడ్ వేదికగా డే/నైట్ టెస్టు సమరం
టీమిండియా, ఆస్ట్రేలియా జట్ల మధ్య బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ సిరీస్ లో భాగంగా రేపటి నుంచి రెండో టెస్టు జరగనుంది. కాగా, బ్యాటింగ్ లెజెండ్ విరాట్ కోహ్లీ, స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రాలను ఆసక్తికర మైలురాళ్లు ఊరిస్తున్నాయి. 

కోహ్లీ ఇప్పటిదాకా ఆస్ట్రేలియాపై టెస్టుల్లో 9 సెంచరీలు సాధించాడు. మరొక్కటి సాధిస్తే 10 శతకాలతో డబుల్ డిజిట్ అందుకుంటాడు. పెర్త్ లో జరిగిన తొలి టెస్టులో సెంచరీ సాధించిన కోహ్లీ... ఆస్ట్రేలియా గడ్డపై 6 సెంచరీలు సాధించిన సచిన్ రికార్డును అధిగమించాడు. 

ఇక, బుమ్రా ఇప్పటివరకు ఆసీస్ పై 16 ఇన్నింగ్స్ ల్లో 18.80 సగటుతో 40 వికెట్లు తీశాడు. అతడు మరో 10 వికెట్లు తీస్తే ఆస్ట్రేలియాపై 50 వికెట్ల మార్కు అందుకుంటాడు.

Adelaide Test
Virat Kohli
Bumrah
Milestones

More Telugu News